బీసీవైపీలోకి ఇచ్ఛాపురం మండలం నుంచి వలసల జోరు.
రామచంద్రయాదవ్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష: కన్వీనర్ మురళి.
భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ)లోకి ఇచ్ఛాపురం మండలం నుంచి చేరికలు ఊపందుకున్నాయి. బుధవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సగ్గు చక్రవర్తి రెడ్డి తరఫున, నియోజకవర్గ కన్వీనర్ బడ్డి మురళి, బొట్టు హరికృష్ణ, కంచిలి మండల ఇన్‌ఛార్జ్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. అన్నెపు ప్రసాద్ రెడ్డి, బుడ్డెపు జోగారావు, మద్దిల సంతోష్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు బీసీవైపీ కండువా కప్పుకున్నారు.
అనంతరం కన్వీనర్ మురళి మాట్లాడుతూ బీసీవైపీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో అవసరం అని అన్నారు. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి సరైన నాయకుడు రామచంద్రయాదవ్ మాత్రమే’ అని తెలిపారు. ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటాలు రాష్ట్రంలో నూతన విప్లవానికి నాంది అని అన్నారు.
దోపిడీ, దుర్మార్గపాలనకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలు ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నాయన్నారు. అలాంటి నాయకుని నాయకత్వంలో పనిచేయడం మా అదృష్టమని పేర్కొన్నారు. 2029 గెలుపు దిశగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అప్పుడే 2029లో బీసీవైపీ విజయం సాధిస్తుంది’ అని మురళి పిలుపునిచ్చారు. కన్వీనర్ బడ్డి మురళి నాయకత్వంపై విశ్వాసంతో పార్టీలోకి రావడం మా అదృష్టం అని నూతనంగా చేరిన కార్యకర్తలు పేర్కొన్నారు.
