KANCHILI : కర్తలి గ్రామంలో ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమం.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: ఎంఈఓ శివరాం ప్రసాద్.
కంచిలి మండలం కర్తలి గ్రామంలో ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమం మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలకాంశాలు చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గుచూపాలని ఎంఈఓ సూచించారు.
యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకంతో పాటు అన్ని విధాలా ప్రభుత్వ బడులే మెరుగని వివరించారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ బడులే సరైన వేదిక. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి అని ఎంఈఓ శివరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ పైల సూర్యనారాయణ, స్కూల్ కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
