రాజగోపాలపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించిన పలాస ఎంపిడిఓ.
PALASA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమస్యలు లేని పంచాయితీలుగా తీర్చిదిద్దేదుకుగాను మండల అధికారులు ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామానికి 4 సార్లు సందర్శించి అక్కడి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించిన నేపథ్యంలో, శ్రీకాకుళం జిల్లా పలాస మండలం, చినంచల పంచాయతీ లో గల రాజగోపాలపురం గ్రామంలో శుక్రవారం నాడు పలాస మండల అధికారి కే.వసంత్ కుమార్ తన సిబ్బందితో కలసి రెవిన్యూ గ్రామ సభ నిర్వహించారు.
గ్రామస్థులు వారి వారి సమస్యలను తెలియజేయగా, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నీటి కాలువలు, గ్రామస్థులకు సంబంధించిన ఉమ్మడి భూమి సబ్ డివిజన్, పంట కాలువల ప్రక్కన ఉన్న సరిహద్దులు సరి చెయ్యడం వంటి సమస్యలను అధికారులు గురించారు. ఈ కార్యక్రమంలో పలాస మండల తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, ఎంపిడిఓ వసంత్ కుమార్, ఏఈ పంచాయతీరాజ్ , ఏఈ హౌసింగ్, డిప్యూటీ తహశీల్దార్, మండల సర్వేయర్ , వీఆర్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
