Homeఆంధ్రప్రదేశ్వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మరింత మేలు

వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మరింత మేలు

Vajrapukotturu: వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మరింత మేలు.

వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు మరింత మేలు – ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష.

వజ్రపుకొత్తూరు మండలంలోని ఎఫ్‌పీఓ (FPO) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు యంత్రాల బ్యాంకు “కస్టమ్ హైరింగ్ సెంటర్” ను పలాస నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష గారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు అందుబాటులోకి రావడం వల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు వ్యవసాయ పనులు వేగవంతంగా పూర్తవుతాయని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా తక్కువ అద్దెకు యంత్రాలను పొందడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం వ్యవసాయ యాంత్రీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే గారు తెలిపారు.
రైతులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

అనంతరం కస్టమ్ హైరింగ్ సెంటర్‌లో అందుబాటులో ఉన్న వివిధ వ్యవసాయ యంత్రాలను ఎమ్మెల్యే గారు పరిశీలించి, వాటి వినియోగంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు గారు ఎంపీడీఓ గారు వ్యవసాయ శాఖ అధికారులు, వెలుగు సిబ్బంది ఎఫ్‌పీఓ ప్రతినిధులు, వజ్రపు కొత్తూరు మండల అధ్యక్ష కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular