Homeఆంధ్రప్రదేశ్రైల్వే ఎల్.సి గేటును ఓ ప్రయివేటు బస్సు బలంగా ఢీ

రైల్వే ఎల్.సి గేటును ఓ ప్రయివేటు బస్సు బలంగా ఢీ

PALASA : ఎల్.సి గేటు సాంకేతిక లోపంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.

ఎల్.సి గేటు సాంకేతిక లోపంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోగల రైల్వే ఎల్.సి గేటును ఓ ప్రయివేటు బస్సు బలంగా ఢీ కొట్టడంతో సాంకేతికలోపం ఏర్పడి సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గేటు వేస్తున్న సమయంలో తొందరగా గేటు క్రాస్ చెయ్యాలనే ఆత్రుతతో ప్రయివేటు బస్సు అతివేగంతో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెపుతున్నారు.

బస్సు బలంగా ఢీ కొట్టడంతో ఓ వైపు ఉన్న ఎల్.సి గేటు లాకింగ్ సిస్టం దెబ్బతినడంతో ప్రత్యామ్నాయంగా తాత్కాలిక గేటును ఏర్పాటుచేసి మరమ్మతులు చేపట్టారు.

సమస్యను సరిదిద్ధేందుకు ఓ గంటసమయం పట్టగా, ఇరువైపులా వాహనాలు పెద్దసంఖ్యలో ఆగిపోడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మండుటెండలో గంటపాటు వాహనాలు నిలిచిపోడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

అనంతరం రైల్వే సాంకేతిక నిపుణులు సమస్యను పరిష్కరించడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమవగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు నిత్యం వాహనదారులకు ఇటువంటి ఇబ్బందులు తప్పవని పలువురు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular