Homeఆంధ్రప్రదేశ్ప్రతిభకు ప్రోత్సాహం.

ప్రతిభకు ప్రోత్సాహం.

KAVITI : విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి,  వారిని మరింత ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించే  ఉద్దేశం.

ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన సొండి కుల సంక్షేమ సంఘం.

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి,  వారిని మరింత ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించే  ఉద్దేశంతో శ్రీ చింతామణి సొండి కుల సంక్షేమ సంఘం కవిటి ఆధ్వర్యంలో నిర్వహించిన  సర్వజన  సమావేశంలో  పదో తరగతి పరీక్షల్లో  అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన  సొండికుల  విద్యార్థినీ,  విద్యార్థులను  ఘనంగా  సన్మానించారు.
ఈ సందర్భంగా లాభాల శ్రీకర్‌ 589,   నల్ల మోహనప్రియ 579,   పాండవ శ్రీవల్లి 535,   పాండవ హేమసుందర్‌ 497 మార్కులు  సాధించిన  విద్యార్థులకు మెమొంటోలు,  శాలువాలు,  ప్రతిభా ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.

సంఘం అధ్యక్షులు పాండవ రామారావు మాట్లాడుతూ,  ప్రతి సంవత్సరం పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి సన్మానించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు.  విద్యార్థులు కృషి,  పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లో  విద్యకు  ప్రాధాన్యత  పెంపొందించేందుకు  ఇలాంటి  కార్యక్రమాలు దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.   కార్యక్రమంలో సంఘం సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular