Homeఆంధ్రప్రదేశ్శ్రీ చింతామణి అమ్మవారి మహా సంబరాలు.

శ్రీ చింతామణి అమ్మవారి మహా సంబరాలు.

KAVITI : శ్రీ చింతామణి అమ్మవారి మహా సంబరాలు ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 2 వ తేదీ వరకు.

13 నుండి చింతామణి అమ్మవారు మహా సంబరాలు..

కవిటి మండల కేంద్రం కవిటిలో కొలువైయున్న ఉద్దానం ఇలవేలుపు,  శ్రీ చింతామణి అమ్మవారి మహా సంబరాలు ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభమై జూన్ 2 వ తేదీతో ముగుస్తాయని సంబరాల నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సంబర మహోత్సవాల్లో భాగంగా,  10వ తేదీన శుభంరాట కార్యక్రమంతో మొదలై 13 వ తేదీ రాత్రి అమ్మవారిని మేళ తాళాలతో బాణాసంచా కాంతులు నడుమ గ్రామానికి ఘనంగా తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.

అనంతరం గ్రామంలో కొలువైన అమ్మవారిని పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లడం జరుగుతుందన్నారు.  ఈ సందర్భంలో అమ్మవారితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఊరేగింపు ఘనంగా నిర్వహించడంతోపాటు.  భారీ స్టేజి ప్రోగ్రాములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారి అనుమతులు తీసుకొని వచ్చిన ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు.  ఈ సంబరాలు సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అందరి ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు తీసుకొని సంబరాలకు ముందస్తుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో సంబరాల నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular