Homeఆంధ్రప్రదేశ్13 బైకులను దొంగతనం చేసిన ముద్దాయి నాతమిరి రఘునాధన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

13 బైకులను దొంగతనం చేసిన ముద్దాయి నాతమిరి రఘునాధన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

PALASA : 13 బైకులను దొంగతనం చేసిన ముద్దాయి నాతమిరి రఘునాధన్ ను పోలీసులు అరెస్టు చేశారు.

PALASA : ఉత్తరాంధ్రతో పాటు పక్క రాష్ట్రమైన ఒరిస్సాలో కూడా బైక్స్ దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పలాస పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుండి 13 బైకుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పరిధిలోని 13 బైకులను దొంగతనం చేసిన ముద్దాయి నాతమిరి రఘునాధన్ ను పోలీసులు అరెస్టు చేశారు. 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇంటర్ వరకు చదివి ఆ తరువాత చదువు మానివేసి వెల్డింగ్ పనులు చేస్తూ చెడు పలు వ్యాసనాలకు అలవాటు పడి డబ్బులు కోసం పలు ప్రాంతాల్లో బైక్లు దొంగతనం చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలో పలాస ప్రాంతంలో పలు కాలనీలో బైకులు మాయమవడం తో నిఘా పెట్టిన పోలీసులకి రిక్కీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

జిల్లాలో నరసన్నపేట, ఆమదాలవలస, పలాస, విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో కూడా దొంగతనాలు చేశారు ఇతరపై పలు కేసులు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం జరడ పోలీస్ స్టేషన్ పరిధి లో చేసిన ఒక దొంగతనం కేసుల్లో పట్టుబడిన నిందితుడు కేసు దర్యాప్తు లో భాగంగా విచారణ చేయగా నేరస్థుడు నుండి కేసు కి సంబందించిన కేసు సొత్తు ని రికవరీ చేయటం జరిగినదనీ పోలీసులు తెలిపారు.

గతములో 18 దొంగతనము కేసుల్లో తేది 29.09.2024 న పర్లాఖిమిడి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లి తిరిగి తేది 08.01.2026 న బయటకు వచ్చాడు. రాగానే మరల బైకు దొంగతనాలకి ప్లాన్ చేయడంతో దొరికినట్లు క్రైమ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. రేపు కోర్టులో హాజరు చేయనున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular