Homeఆంధ్రప్రదేశ్మండపల్లి రజకవీధికి పక్కా రహదారి

మండపల్లి రజకవీధికి పక్కా రహదారి

KANCHIL:మండపల్లి రజకవీధికి పక్కా రహదారి.

  1. మండపల్లి రజకవీధికి పక్కా రహదారి

రూ.5 లక్షలతో సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం

కంచిలి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతు కల్పనకు మరో అడుగు పడింది. కంచిలి మండలం మండపల్లి గ్రామంలోని రజకవీధిలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న 160 మీటర్ల సిమెంట్ రోడ్డు పనులను కంచిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదిన రామారావు ప్రారంభించారు.

ఎన్నో రోజులుగా దుమ్ము, బురద సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రజకవీధి ప్రజలకు ఈ రహదారి నిర్మాణం ఊరటనివ్వనుంది. వర్షాకాలంలో రాకపోకలకు ఎదురవుతున్న అవరోధాలు తొలగి, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఈ సందర్భంగా మాదిరి రామారావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చేపట్టిన పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

సిమెంట్ రోడ్డు నిర్మాణంతో రజకవీధి రూపురేఖలు మారనున్నాయని, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular