రాజోలు మండలం రాజోలు గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ‘స్వచ్ఛ రథం’ (చెత్త సేకరణ వాహనం) ను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని కాపాడటంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఇంటి నుండి వచ్చే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా వర్గీకరించి స్వచ్ఛ రథాలకు అందజేయాలని ప్రజలను కోరారు.
గ్రామాలను పరిశుభ్రంగా, అందంగా మరియు ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
