ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ఫల్టీ కొట్టిన ఆటో.
ఎనిమిది మందిలో నలుగురు పరిస్థితి విషమం.
పార్వతీపురం మాన్యం జిల్లా, వీరఘట్టం మండలం పాలమట్టి గ్రామంలో జరుగుతున్న వివాహం కు 8 మంది ప్రయాణికులు, ఆటోలో ప్రయాణిస్తూ వెళ్తుండగా పాలకొండ మండలం గజాల కాన సమీపంలో ఎదురుగా వస్తున్నటువంటి బస్సును తప్పించబోయి పల్టీ కొట్టిన ఆటో. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఎనిమిది మందిలో నలుగురు పరిస్థితి విషమం.

తొలిత పాలకొండ ఏరియా ఆసుపత్రికి 8 మందిని తరలించగా, అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని, అక్కడనుండి శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. మరో నలుగురు గాయాలకు పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. ఈ క్షతగాత్రులత రాజాం మండలం, పొగిరి గ్రామం కు చెందిన వారిగా గుర్తించిన స్థానికులు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
