Homeఆంధ్రప్రదేశ్సీఎం దృష్టికి ఎంఎటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు.

సీఎం దృష్టికి ఎంఎటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు.

KANCHILI : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పీజీఆర్‌ఎస్ ద్వారా వినతిపత్రం.

శ్రీకాకుళం జిల్లా,  కంచిలి మండలం,  రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఎంఎటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని,  12 నెలల పూర్తి జీతాలు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ఎంఎటీఎస్ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బుడ్డెపు కామేష్ రెడ్డి,  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పీజీఆర్‌ఎస్ ద్వారా వినతిపత్రం సమర్పించారు.

శ్రీకాకుళం జిల్లా,  నరసన్నపేటకు ముఖ్యమంత్రి విచ్చేసిన సందర్భంగా తమ సమస్యలను తెలియజేసినట్లు తెలిపారు.   రాష్ట్రంలోని 4,072 మంది ఎంఎటీఎస్ ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యా రంగంలో సేవలందిస్తున్నప్పటికీ,  ఇంకా రెగ్యులరైజేషన్ జరగలేదని పేర్కొన్నారు  . అలాగే పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచడంతో పాటు,   ఏడాది పొడవునా 12 నెలల జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  ఎంఎటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular