Homeఆంధ్రప్రదేశ్నాటు సారాపై ఎక్సైజ్ ఉక్కుపాదం.

నాటు సారాపై ఎక్సైజ్ ఉక్కుపాదం.

SOMPETA : ఒడిశా  నుంచి  నాటు  సారా  రవాణాను  అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ  చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ జి.వి.రమణ.

SOMPETA : నాటు సారాపై ఎక్సైజ్ ఉక్కుపాదం, 100 పాకెట్లు స్వాధీనం – ఇద్దరికి రిమాండ్.

సోంపేట ఎక్సైజ్ సీఐ జి.వి.రమణ ఆధ్వర్యంలో,  శుక్రవారం నిర్వహించిన దాడుల్లో 100 నాటు సారా పాకెట్లు,  ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.  ఎక్సైజ్ అధికారుల వివరాల మేరకు బురదపాడుకు చెందిన గేదెల మోహనరావు,   కంచిలికి చెందిన దుబ్బ ధర్మారావులపై గతం నుంచే నిఘా ఉంచిన అధికారులు గొల్లకంచి వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు.   వారి వద్ద నుంచి 100 నాటు సారా పాకెట్లు,   ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నిందితులిద్దరిపై  గతంలో  కూడా పలు కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు తెలిపారు.   అనంతరం  వారిని  సోంపేట  కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

ఒడిశా  నుంచి  నాటు  సారా  రవాణాను  అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ  చేపట్టినట్లు ఎక్సైజ్ సీఐ జి.వి.రమణ తెలిపారు.   మూడు కంటే ఎక్కువ నాటు సారా కేసులు  ఉన్న  వారిపై  పీడీ  యాక్ట్  అమలు చేస్తామని  హెచ్చరించారు.    నాటు సారా  రవాణాపై  సమాచారం  తెలిసిన  వారు  టోల్ ఫ్రీ  నంబర్ 14405 లేదా 9440902358కు సమాచారం అందించాలని,  సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.  ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్నాథ్‌తో పాటు సిబ్బంది భాను ప్రసాద్,  ఉమాపతి,  మార్కారావులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular