Homeఆంధ్రప్రదేశ్ట్రావెల్ బస్సు ప్రమాదం.

ట్రావెల్ బస్సు ప్రమాదం.

KANCHILI : కర్నూలు జిల్లా పెద్దకోడూరు మండలం, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఎమ్మిదినూరు గ్రామం నుంచి సుమారు 40 మంది భక్తులు కాశి యాత్ర.

KANCHILI : శ్రీకాకుళం జిల్లాలో ట్రావెల్ బస్సు ప్రమాదం – పలువురికి స్వల్ప గాయాలు.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగం గ్రామ సమీప నేషనల్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.  రాత్రి సుమారు 1:30 గంటల సమయంలో కాశి తీర్థయాత్రకు వెళ్తున్న ట్రావెల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు  ట్రావెల్ ఏజెంట్‌కు స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా పెద్దకోడూరు మండలం, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన ఎమ్మిదినూరు గ్రామం నుంచి సుమారు 40 మంది భక్తులు కాశి యాత్రకు బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రయాణం మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న కంచిలి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

Most Popular