PALASA : చలపతి కుటుంబానికి సి.ఎమ్.ఆర్.ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే శిరీష గారు.
పలాస నియోజకవర్గం, వజ్రపు కొత్తూరు మండలం, వజ్రపుకొత్తూరు గ్రామంనకు చెందిన సిర్ల చలపతి రావు ఎలుగు బంటి దాడిలో గాయాలపాలై హాస్పిటలో చికిత్స పొందుతూ మరణించారు. అతని కుటుంబ సభ్యులు స్థానిక నాయకుల సహాయంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్లగా, ఆమె ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి సహాయానిది కి నమోదు చేయడం జరిగింది.
పలాస ఎమ్మెల్యే గారి కార్యాలయంలో లబ్దిదారుల కుటుంబానికి రూ. 2,00,000/- (రెండు లక్షల) విలువైన ముఖ్య మంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును ఎమ్మెల్యే గారి చేతులమీదుగా అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మాట్లాడుతూ మెరుగైన వైద్య అవసరాలకు పేదరికం అడ్డు కాకూడదన్న ఆశయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు CMRF నిధుల ద్వారా వేలాది కుటుంబాలను ఆదుకుంటున్నారన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. అనారోగ్య బారిన పడి ఆర్ధికంగా చితికి పోయి కష్టాలలో వున్న కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ సహాయం కొండంత అండ నిలుస్తుందన్నారు.
