వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి కాలనీ లో అంతాకలసి సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకరించాలని కాశీబుగ్గ సి.ఐ వై.రామకృష్ణ కోరారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ జి.ఏం.ఈ కాలనీ లో కాశీబుగ్గ సి.ఐ వై.రామకృష్ణ కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
రెండురోజుల క్రితం దొంగలు జి.ఎం.ఈ కాలనీ లోగల తాళాలు వేసిన ఓ ఇంట్లో తాళాలు పగలగొట్టి చొరబడి చోరీకి పాల్పడగా, మరుసటి రోజు కాశీబుగ్గ లోగల తాళాలు వేసిఉన్న మరో ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదును దోచుకెళ్లారు.
వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో కాశీబుగ్గ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేసే ప్రక్రియలో భాగంగా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ లోగల జి.ఎం.ఈ కాలనీలో కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేసి అంతాకలసి సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకుని అనుమానిత అపరిచిత వ్యక్తుల కదలికలను గుర్తించి నేరాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సి.ఐ వై.రామకృష్ణ, యెస్.ఐ నరసింహమూర్తి, యెస్.ఐ సునీల్ కుమార్ తోపాటు జి.ఎం.ఈ కాలనీ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
