Homeఆంధ్రప్రదేశ్అమ్మవారి సంబరాలకు శుభ రాట.

అమ్మవారి సంబరాలకు శుభ రాట.

KAVITI : నేడు చింతామణి అమ్మవారి సంబరాలకు శుభ రాట, పాల్గొన్న ప్రభుత్వ విప్ బెందాలం అశోక్.

నేడు చింతామణి అమ్మవారి సంబరాలకు శుభ రాట.
పాల్గొన్న ప్రభుత్వ విప్ బెందాలం అశోక్.

శ్రీశ్రీశ్రీ చింతామణి అమ్మవారి గ్రామదేవత మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి.  ఈ మహోత్సవాలకు నాంది పలుకుతూ,  ఆదివారం ఉదయం కంభస్తం కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో, మేళతాళాల నడుమ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు.   అమ్మవారి నామస్మరణతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయి,  ఉత్సాహంతో కళకళలాడింది.   ఈ పూజల్లో స్థానిక ఎమ్మెల్యే,   ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దానంలో ప్రతిష్ఠాతకం గా జరుపుతున్న కవిటి చింతామణి సంబరాలు  వైభవంగా  నిర్వహించడం   గర్వకారణమన్నారు.    ప్రజలంతా సహకారం అందజేసి,  ఎటువంటి  అవాంఛనీయ  సంఘటనలు  లేకుండా  జరిగేలా చూడాలన్నారు.   పోలీసుల,  అధికారుల సూచనలు పాటిస్తూ,  విజయవంతం చేయాలన్నారు.    సంబరాల నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంబరాల సందర్భంగా  సాంసృతిక  కార్యక్రమాలు,   విద్యుత్ దీపాలంకరణలు   చేయడం  జరుగుతుందన్నారు.   ఈ పూజల్లో పూజా కమిటీ సభ్యులతో పాటు స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular