KANCHILI : క్లస్టర్-7 పరిధిలో 300 మందికి పైగా కార్యకర్తల హాజరు.
కంచిలి మండలం క్లస్టర్-7 పరిధిలోని సిర్తలి, ఎంఎస్ పల్లిలో బుధవారం మహానాడు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 300 మందికి పైగా కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను విజయవంతం చేశారు. పార్టీ జెండాలు, ఎన్టీఆర్ చిత్రపటాలతో ప్రాంగణమంతా పసుపుమయంగా మారింది.
జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లు, యూనిట్, బూత్ కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహానాడు ప్రాధాన్యత, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు దిశానిర్దేశం చేశారు. ‘గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి’ అని ఐటీడీపీ మండల అధ్యక్షుడు వాసాల రమేష్ నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు.
