గ్రామీణ క్రీడా ప్రతిభకు వేదికగా వేసవి వాలీబాల్ శిబిరం.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి.
ఇంచార్జ్ హెచ్‌ఎం బాబురావు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో కవిటి మండలం బి.గొనపపుట్టుగ ఉన్నత పాఠశాల ఆవరణంలో వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాన్ని ఇంచార్జ్ హెచ్‌ఎం బల్లెడ బాబురావు ప్రారంభిస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
ఈ శిబిరానికి స్థానిక పీఈటీ, శ్రీకాకుళం జిల్లా వాలీబాల్ జాయింట్ సెక్రటరీ బి. రమేష్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నిర్వహించే ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.
పదో తరగతి లోపు విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాబురావు పిలుపునిచ్చారు. మే 31 వరకు కొనసాగే ఈ శిబిరంలో ప్రాథమిక నైపుణ్యాల నుంచి పోటీ స్థాయి శిక్షణ వరకు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శిక్షకులు రమేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.
