Homeఆంధ్రప్రదేశ్వర్చువల్ నగరవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే.

వర్చువల్ నగరవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే.

PALASA: పలాస నియోజకవర్గంలోని మెండు ఫారెస్ట్ ప్రాంతంలో 120 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ నగరవనాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.

వర్చువల్ నగరవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష

Palasa: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వినోద వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగరవనాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, పలాస నియోజకవర్గంలోని “మయూరి వనం” వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష  పాల్గొన్నారు.

జిల్లా అటవీశాఖ అధికారి (DFO) శ్రీ వెంకటేష్  అధ్యక్షతన నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసిన 18 నగర వనాలను అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు వర్చువల్ ద్వారా అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష  మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా నగరవనాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

పలాస నియోజకవర్గంలోని మెండు ఫారెస్ట్ ప్రాంతంలో 120 ఎకరాల విస్తీర్ణంలో రూ.2 కోట్ల వ్యయంతో ఈ నగరవనాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి అత్యంత సమీపంలో, జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ నగరవనానికి “మయూరి వనం” అని నామకరణం చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

ఈ నగరవనంలో ప్రజలు ఉదయ, సాయంత్ర వేళల్లో నడక, వ్యాయామం, యోగా వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు అనువైన సదుపాయాలు, విశ్రాంతి ప్రదేశాలు, పచ్చదనం నిండిన వాతావరణం కల్పించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడడంలో ఇటువంటి నగరవనాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో ప్రజలకు ఉపయోగపడే పర్యావరణహిత అభివృద్ధి కార్యక్రమాలు అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలందరూ ఈ నగరవనాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సప్నికల్ దినకర్ , ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, గ్రంధాలయ చైర్మన్ పీరికట్ల విఠల్ , ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాస్ , బిసి సెల్ ప్రధాన కార్యదర్శి లోడగల కామేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు, కూటమి నాయకులు,అటవీశాఖ అధికారులు, ఆర్టీవో  వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular