Homeఆంధ్రప్రదేశ్జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ.

జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ.

Srikakulam: శ్రీకాకుళం పార్లమెంట్‌లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.

శ్రీకాకుళం పార్లమెంట్‌లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం.

Srikakulam : శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్డులో గల బృందావనం ఫంక్షన్ హాల్‌లో, శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకులు, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్ తో  పాటు రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీ గేదెల చైతన్య , నిర్మాణ సారథుల సభ్యుల బృందంతో కలిసి జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఉదయం టెక్కలి నియోజకవర్గం, మధ్యాహ్నం నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ దరఖాస్తులను సమర్పించడం జరిగినది.

పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన ప్రతి జనసైనికుడి అంకితభావం అభినందనీయం. అందిన ప్రతి దరఖాస్తును అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరిశీలించి తగిన నివేదికను పార్టీ నాయకత్వానికి అందజేస్తాము అని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular