మందస మండలం హరిపురంలో రైతులకు విత్తనాల పంపిణీ
మందస మండలం హరిపురం సచివాలయం వద్ద రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష
HARIPURAM : హరిపురం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతులకు విత్తనాలు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్‌కు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించి రైతులకు చేయూతనివ్వడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతులందరూ విత్తనాలను సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
