PALASA : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ పరిధిలో APTIDCO -PMAY (U) పథకం కింద 300 sft / 360 sft / 430 sft గృహాల కొరకు దరఖాస్తు చేసి, సంబంధిత మొత్తాలను డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో చెల్లించిన కొంతమంది దరఖాస్తుదారులు గృహాలు మంజూరు కాకపోవడంతో, వారు చెల్లించిన మొత్తాలను ప్రభుత్వము తిరిగి చెల్లించిన విషయము ప్రజల దృష్టికి తీసుకురావడం అయినది.
సంబంధిత దరఖాస్తుదారులు చెల్లించిన డిమాండ్ డ్రాఫ్టులు, మున్సిపల్ రసీదులు మరియు ఇతర పత్రాలను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వం వారు చెల్లింపుల మొత్తాన్ని చెక్కుల ద్వారా తిరిగి చెల్లించబడును. కావున APTIDCO -PMAY (U) గృహ పథకానికి సంబంధించి చెల్లింపులు చేసి గృహాలు మంజూరు కానీ దరఖాస్తుదారులు తమ వద్దనున్న పత్రాలతో పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన వివరాలను నిర్ధారించుకోవలసినదిగా తెలియజేయడమైనది.
ఈ ప్రకటనపై ఎవరైనా అభ్యంతరాలు, హక్కులు లేదా క్లైమ్ లు కలిగి ఉన్న ఎడల ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నుండి ఏడు రోజులలోపు తగిన ఆధారాలతో పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయానికి లిఖితపూర్వకముగా తెలియజేయగలరు అని పలాస కాశీబుగ్గ పురపాలక సంఘ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేసినారు.
