శ్రీకాకుళం జిల్లా, పలాస – కాశీబుగ్గ మునిసిపాలిటీ, రాజమ్మ కోలనీ కి చెందిన ఎల్.ఈశ్వరరావు అనే యువకుడు, కాశీబుగ్గ లోగల బిగ్ లాట్స్ అనే ఓ మొబైల్ షాప్ లో నెలసరి జీతానికి పనిచేస్తున్నాడు.
అయితే ఈరోజు ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో మొబైల్ షాప్ లోనికి ఇద్దరు యువకులు ప్రవేశించి, అందులో పనిచేస్తున్న ఈశ్వరరావు అనే యువకునితో గొడవకు దిగి, బయటకు ఈడ్చుకొచ్చి తాము ఆల్రెడీ తెచ్చుకున్న చాకుతో గొంతుకోసి పరారైనట్లు స్థానికులు చెపుతున్నారు.
క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెడ భాగంలో లోపల 8 కుట్లు, బయట 12 కుట్లు పడినట్లు వైద్యులు చెపుతున్నారు.
దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు బాధితుడు నివసిస్తున్న కాలనీకి చెందినవారేనని, వ్యక్తిగత కారణాలే దాడికి కారణమని, దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెపుతున్నారు.
కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
