తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు.
పగలంతా రెక్కీ చేసి రాత్రికి తాళాలు వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా, పలాస – కాశీబుగ్గ మునిసిపాలిటీ, శ్రీనివాసనగర్ లోగల హేమశంకర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, రెండు కిలోల వెండి ఆభరణాలతోపాటు 70 వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు బాధితుడు హేమశంకర్ చెపుతున్నాడు.
వేసవి సెలవులు కారణంగా తన కుటుంబంతో సొంతూరైన మందస వెళ్లగా గతరాత్రి దొంగలు చోరీకి పాల్పడినట్లు స్థానికులు చెపుతున్నారు.
ఉదయాన్నే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లు తెరిచిఉండడాన్ని గమనించి పోలీసులకు,ఇంటి యజమానికి సమాచారాన్ని అందివ్వగా కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు క్లూస్ టీమ్ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
దొంగలు తాళాలు పగలగొట్టేందుకు ఉపయోగించిన ఇనుప పనిముట్లను పోలీసులు స్వాధీనపరచుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
