Homeఆంధ్రప్రదేశ్మానవత్వమే మా ధర్మం, సేవే మా లక్ష్యం.

మానవత్వమే మా ధర్మం, సేవే మా లక్ష్యం.

KAVITI : మానవత్వమే మా ధర్మం, సేవే మా లక్ష్యం.

మానవత్వమే మా ధర్మం, సేవే మా లక్ష్యం.
ఎస్జీఎఫ్ ఆత్మీయ సమ్మేళనంలో కీలక తీర్మానం.
ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా ప్రతిజ్ఞ.
సేవా స్ఫూర్తితో కదిలిన స్పెషల్ గైస్ ఫౌండేషన్.

కవిటి మండల కేంద్రంలోని వెలుగు కార్యక్రమంలో స్పెషల్ గైస్ ఫౌండేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ‘ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ‘మానవత్వమే మా ధర్మం, సేవే మా లక్ష్యం’ అనే నినాదంతో ఎస్జీఎఫ్ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రత్యేక చర్చ: 

ఈ సమావేశంలో ఉద్దానం ప్రాంతంలో తీవ్రంగా వేధిస్తున్న కిడ్నీ వ్యాధి సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. దశాబ్దాలుగా ఉద్దానం ప్రజలను పీడిస్తున్న ఈ మహమ్మారిని నిర్మూలించడమే ఎస్జీఎఫ్ ప్రధాన ధ్యేయంగా సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఫౌండేషన్ సభ్యులు వృత్తాకారంలో కూర్చుని, ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, మంచినీటి సౌకర్యం, బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించే దిశగా SGF అడుగులు వేయనుందని ప్రకటించారు.

చేతల్లో చూపిస్తాం : 

ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, “కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి మేలు చేయడమే మా లక్ష్యం. ఉద్దానం నుంచి కిడ్నీ వ్యాధిని తరిమికొట్టే వరకు మా పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు.

యువతను రెచ్చగొట్టి వాడుకోవడం కాదు, సేవా మార్గం వైపు నడిపించడమే ఎస్జీఎఫ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమాజంలోని పేద, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని, ఎస్జీఎఫ్ కుటుంబంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.

సేవే మార్గం :

రక్తదాన శిబిరాలు, అన్నదానం, విద్యార్థులకు సాయం, పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు మధ్య వారధిగా నిలిచి ఉద్దానం ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఎస్జీఎఫ్ సభ్యులు, సేవాభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular