సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
బాధిత కుటుంబాలకు రూ.3.01 లక్షల ఆర్థిక సాయం.
ఎమ్మెల్యే అశోక్ చేతుల మీదుగా అందజేత.
కంచిలి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన అనారోగ్య బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి మంజూరైన రూ.3,01,091 విలువైన చెక్కులను స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సహాయాన్ని అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి తక్షణ సాయం అందిస్తున్నామని అన్నారు.
లబ్దిదారుల వివరాలు:
లమ్మత అప్పలరాజు (పెద్ద శ్రీరాంపురం) – రూ.1,24,258/-
గోలియా మహాలక్ష్మి (మఠం సరియాపల్లి) – రూ.75,000/-
భూదేవి దోళాయి (దోళాయి పుట్టుగ) – రూ.71,833/-
నిమ్మన రాకేష్ (కత్తివరం) – రూ.30,000/-
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, కష్టకాలంలో ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే అశోక్, టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
