Homeఆంధ్రప్రదేశ్మహానాడును విజయవంతం చేయండి.

మహానాడును విజయవంతం చేయండి.

MARRIPADU : మహానాడును విజయవంతం చేయండి : ఉదయగిరి, ఆత్మకూరు కార్యకర్తలు అభిమానులకు మాజీ ఎమ్మెల్యేల పిలుపు.

మహానాడును విజయవంతం చేయండి : ఉదయగిరి, ఆత్మకూరు కార్యకర్తలు అభిమానులకు మాజీ ఎమ్మెల్యేల పిలుపు.

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు,  టీడీపీ సీనియర్ నాయకులు కన్నబాబు సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు మహానాడును నెల్లూరులో నిర్వహించలేదని,  ఆ అవకాశం ఈసారి జిల్లా మంత్రులు,  ఎం.పీ.,  ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరులో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చాడని,  అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మహానాడు ను విజయవంతం చేసేందుకు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ,  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని,  మహానాడు పనులను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.   అలాగే వైసిపి నాయకులు ఎన్ని మహానాడులు నెల్లూరులో పెట్టుకున్న రాబోవు ఎన్నికల్లో పదికి పది స్థానాలు తామే గెలుస్తామని ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.   గత ప్రభుత్వంలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడంతో గమనించిన ప్రజలు అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఇచ్చారన్నారు.   దీంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్త ప్రభుత్వ ఆర్థిక విధ్వంసాన్ని కూల్చుకుంటూ తన అనుభవంతో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ,  ముందుకు సాగుతున్నారని తెలిపారు.

ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడి అటు పోలవరం అయితేనేమి,  ఇటు రాజధాని అమరావతి శరవేగంగా పనులు ముందుకు సాగుతున్నాయన్నారు.   యువ నాయకుడు నారా లోకేష్ కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి నిధులను సమకూర్చడంలో చాకచక్కగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.   కావున ఉదయగిరి,  ఆత్మకూరు టిడిపి నాయకులు,  కార్యకర్తలు,  అభిమానులు మహానాడు కి తండోపతండాలుగా తరలివచ్చి మహానాడుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చల్లా రవికుమార్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular