Homeఆంధ్రప్రదేశ్ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి.

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి.

NANDIGAM : నందిగాం మండలం కొండ తెంబూరు గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి.

నందిగాం మండలం కొండ తెంబూరు గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.   శ్రీకాకుళం నుంచి ఒడిస్సా వైపు కూరగాయలు లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్ పైనుంచి వ్యతిరేక దిశలో ఉన్న రోడ్డు పైకి దూసుకుపోయింది.

అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా,  తీవ్ర గాయాలు పాలైన క్లీనర్ను టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,  చికిత్స పొందుతూ మృతి చెందాడు.   విషయం తెలుసుకున్న పోలీసులు,  నేషనల్ హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular