Homeఆంధ్రప్రదేశ్బరితెగిస్తున్న అక్రమణదారులు.

బరితెగిస్తున్న అక్రమణదారులు.

PALASA : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినప్పటికీ డోంట్ కేర్

కావేవీ ఆక్రమణకు అనర్హం అన్నట్లు కొంతమంది అక్రమణదారులు చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూములు ఆఖరికి జాతీయరహదారులను సహితం విడిచిపెట్టడం లేదు.

శ్రీకాకుళం జిల్లా పలాస లో 16 వ నంబర్ జాతీయరహదారికి పక్కనే ఓ వ్యాపారవేత్త కు చెందిన కాస్త స్థలంలో గోడౌన్ నిర్మించగా తన వ్యాపార సౌలభ్యం కోసం ఆ గోడౌన్ నుండి జాతీయరహదారిని కలుపుతూ మధ్యలో ఉన్న ఏటిబట్టి కాలువ పై వంతెన నిర్మించాడు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కు చెందిన అధికారులు పలుమార్లు నోటీసులు జారీచేసినప్పటికీ డోంట్ కేర్ అంటూ ఈసారి ఏకంగా పకడ్బందీగా కాంక్రీట్ సిమెంట్ తో రోడ్డు వేసేసాడు.

లక్ష్మీపురం టోల్ ప్లాజా నుండి పలాస వైపు వచ్చే మార్గంలో మొగిలిపాడు వద్దగల పై వంతెన కు సమీపంలో ప్రక్కనే ఏటిబట్టి కాలువ ఉన్న కారణంగా సర్వీస్ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది.హైవే నుండి పలాస వైపు వెళ్లే వాహనదారులు ఆ ఇరుకైన సర్వీస్ రోడ్డులో పోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే.

అటువంటి ప్రదేశంలో ఆ వ్యాపారవేత్త ఏటిబట్టి కాలువను కప్పేసి జాతీయరహదారిని కలుపుతూ సొంత లాభంకోసం రోడ్డు వేసుకోడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయరహదారి కి సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకోడంతోపాటు పంటపొలాలకు సాగునీరందించే కాలువను సహితం కప్పేసిన సదరు వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రమణలు వెంటనే తొలగించాలని పలువురు మేధావులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular