Homeఆంధ్రప్రదేశ్నీట్ అవకతవకలు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనo.

నీట్ అవకతవకలు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనo.

PALASA : భారతదేశంలోఅత్యంత తీవ్రమైన పోటీ పరీక్షల్లో ఒకటిగా ఉన్న నీట్ పరీక్ష రద్దు వ్యవస్థల వైపల్యానికి నిదర్శనమని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎల్ వెంకటాచలం అన్నారు.

నీట్ అవకతవకలు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనo – యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎల్ వెంకటాచలం.

భారతదేశంలోఅత్యంత తీవ్రమైన పోటీ పరీక్షల్లో ఒకటిగా ఉన్న నీట్ పరీక్ష రద్దు వ్యవస్థల వైపల్యానికి నిదర్శనమని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎల్ వెంకటాచలం అన్నారు.

గురువారం విలేకరులతో మాటాడుతూ దేశవ్యాప్తంగా 22 లక్షల పైగా విద్యార్థులు పాల్గొన్న పరీక్ష లో అవకతవకలు బయటపడడము చాలా కాలంగా పేరుకుపోతున్న వ్యవస్థాగత వైఫల్యమని చెప్పొచ్చనీ అన్నారు.  పేపర్ భద్రతలో వైఫల్యం, లీకేజీలు. పరీక్షల రద్దు వంటివి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని తల్లి దండ్రులకు మనో వేదనికి గురిచేస్తుందని అన్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఎక్కువ గంటల ప్రిపరేషన్,  కోచింగ్ లకు ఆర్థిక భారం ఈ పరీక్షల రద్దు తో నీట్ అభ్యర్థులు ప్రతీ ఏటా మానసిక ఒత్తిడి కి గురవుతున్నారన్నారు.

నిజాయితీగా చదివిన విద్యార్థులకు వ్యవస్థల మీద ప్రభుత్వాల మీద నమ్మకం సన్నగిల్లుతుందని అదే పదే పదే కొనసాగితే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు.  ఇలా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా  ‘చట్టం తన పని తనే చేస్తుందని’  డైలాగు చెప్పడం తప్ప పారదర్శక మైన మార్పులు కనిపించడం లేదన్నారు.  దేశ భవిష్యత్ ను నిర్మించాల్సిన విద్యా వ్యవస్త విద్యార్థులు ఆశయాలుసాధించేలా ఉండాలే తప్ప వారి లక్ష్యాలకు తూట్లు పొడరాదని అన్నారు. ఇటువంటి చర్యలను తిప్పికొట్టకపోతే ఆ నష్టం సమాజానికి కూడా అన్నది,  ప్రతీ ఒక్కరూ గమనించాలని బాధ్యులపై ప్రభుత్వం కటిన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసి విద్యార్థులుకు మరియు ప్రజలకి వ్యవస్థల పట్ల నమ్మకం కలిగించాలని వెంకటాచలం కోరారు.

RELATED ARTICLES

Most Popular