రైలునుండి జారిపడిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన పలాస 108 సిబ్బంది.
గుర్తుతెలియని రైలు నుండి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణాలను పలాస 108 సిబ్బంది కాపాడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సుమారు 40 సంవత్సరాల వయసుకలిగిన వ్యక్తి ని గమనించిన స్థానికులు 108 కు ఫోన్ ద్వారా తెలపగా,సమాచారమందుకున్న పలాస 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని ప్రధమ చికిత్స అందించిన అనంతరం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
తలకు తీవ్ర గాయం కావడంతో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని వైద్యులు చెపుతుండగా,
వేకువఝామున గుర్తు తెలియని రైలు నుండి వ్యక్తి జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతానికి క్షతగాత్రుడు అపస్మారకస్థితిలో ఉన్నాడని, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన వైద్యులు, క్షతగాత్రుని వివరాలు మరిన్ని తెలియరావాల్సి ఉందని వైద్యులు చెపుతున్నారు.
సమయానికి స్పందించి మానవతను చాటుకున్న పలాస 108 సిబ్బంది సత్యం,సురేష్ ల సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.
