చెట్లను పెంచుదాం – ప్రకృతిని కాపాడుదాం.
పచ్చదనమే ప్రగతికి పునాది.
MANDASA : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మందసాలో గో గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీవో ఏ. తిరుమల రావు చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మొక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా లోహపు గార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏ.ఓ బి.రుషీశ్వరరావు , శ్రీ సంతోష్ కుమార్ పండా , గిన్ని తిరుపతి రెడ్డి , గార కృష్ణ , మామిడి కోదండరావు , బాలరాజు , రాకేష్ బెహరా, మందస టౌన్ యువత పెద్దఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు.
“ఒక మొక్క నాటడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడినట్టే.” పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. నేడు మనం నాటిన మొక్కలు రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనాన్ని అందిస్తాయి. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలి.
