కవిటి/కంచిలి: ప్రజల మధ్యే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ నర్తు రామారావు జన్మదిన వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను పండుగ వాతావరణంలో జరిపారు.
కవిటి మండలం కొత్తపుట్టగలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం ఆదివారం ఉదయం నుంచే సందడిగా మారింది. నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువత, అభిమానులు భారీగా హాజరయ్యారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, శుభాకాంక్షల బ్యానర్లతో కార్యాలయ ప్రాంగణం కళకళలాడింది. కార్యకర్తలు నినాదాలతో ఎమ్మెల్సీ రాకను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్తు రామారావు కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలతో ఆనందాన్ని పంచుకున్నారు. అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పలువురు యువకులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్సీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జన్మదిన వేడుకల అనంతరం ఎమ్మెల్సీ కంచిలి మండల కేంద్రంలోని శ్రీ రాధాకృష్ణ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం కవిటి చింతామణి అమ్మవారి ఆలయం, ఈదుపురం రామాలయం, ఇచ్చాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ప్రాంతం అభివృద్ధి చెందాలని ప్రార్థనలు చేశారు.
ఆలయాల వద్ద ఎమ్మెల్సీని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా, యువత నినాదాలతో ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఇచ్చాపురం సమన్వయకర్త సాడ్ శ్యాం ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ కడియాల పద్మప్రకాశ్, ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, మున్సిపాలిటీ చైర్పర్సన్ లాభాల స్వర్ణమణి, ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ బదకల మోహన్రావు మాట్లాడుతూ ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా నర్తు రామారావు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండే నాయకత్వం ఆయనదని కొనియాడారు.
గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, యువతకు ప్రోత్సాహం, విద్యార్థులకు సహాయం, సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ చూపుతున్న చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజలతో ఆత్మీయ అనుబంధం కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న నర్తు రామారావుకు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానం దక్కాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ పీఎస్ఎస్ అధ్యక్షులు దుర్గాసి ధర్మారావు, కొల్లి ఈశ్వరరావు, గుమ్మడి రామదాసు, కొత్తకోట చంద్రశేఖర్, కొణపల సురేష్, మడ్డు వెంకటరావు, తలగాన తిరుపతిరావు, పలికల జయరాం, షావుకారి చిరంజీవులు, మడ్డు అభి యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
