Homeశ్రీకాకుళంఇచ్ఛాపురంగ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతం.

గ్రామస్థాయి నుంచే పార్టీ బలోపేతం.

KANCHILI: కంచిలిలో కూటమి నాయకులతో టీడీపీ కార్యకర్తల సమావేశం.

KANCHILI: పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా,  కంచిలి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణంలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు, కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, నాయకులు కార్యకర్తలకు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మాదిన రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన కల్పించి ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలే టీడీపీకి అసలైన బలం అన్నారు. గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రాబోయే కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త చురుకుగా పాల్గొని పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో పిఎసిఎస్ చైర్మన్ పైల పురుషోత్తం రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు డొక్కర ఈశ్వరరావు, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular