PALASA : పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ను అమలు చేయాలంటూ, శ్రీకాకుళం జిల్లా, పలాస లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వైసిపి శ్రేణులతో కలసి ధర్నా నిర్వహించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన మానవహారాన్ని, కాశీబుగ్గ పోలీసులు అడ్డుకుని భగ్నం చేసే క్రమంలో పోలీసులకు వైసిపి శ్రేణులకు మధ్య జరిగిన తోపులాటతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈసందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వచ్చాక అనేకవాటిపై ధరలు పెంచారని ముఖ్యంగా విద్యుత్ చార్జీలు 19 వేల కోట్ల రూపాయలు అదనపు చార్జీల రూపంలో వినియోగదారులపై భారం మోపారన్నారు. గతంలో ఉన్నవాటికంటే డబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి ప్రజాలనుంది ముక్కుపిండి వసూల్ చేస్తున్నారని విమర్శించారు. రోడ్లు ప్రయివేట్ వ్యక్తుల చేతికిచ్చి టోల్ వసూళ్లను చెయ్యాలని చూస్తున్నారని ఎద్దేవాచేశారు. ఆఖరికి నడిచేదానికి కూడా టాక్స్ కట్టించుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధమౌతోందన్నారు. మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారన్న ఆయన గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ధరలు పెరిగితే ఇదే చంద్రబాబు నాయుడు అతని తనయుడు లోకేష్ బంకులు దగ్గర నానా హడావిడి చేస్తూ జగన్మోహన్ రెడ్డే పెంచేసాడని అనేవారని, ఇప్పుడు కూటమి లో ఉన్న వీరే ధరలు పెంచి కేంద్రం పై తోసేస్తున్నారని ప్రజలంతా గమనించాలన్నారు.
పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఈసందర్భంగా మాజీమంత్రి సీదిరి డిమాండ్ చేశారు.
