Homeఆంధ్రప్రదేశ్పుస్తకాలు అమ్మితే గుర్తింపు రద్దు చేస్తాం - ఎం ఈ.ఓ సి.హెచ్.శ్రీనివాస్

పుస్తకాలు అమ్మితే గుర్తింపు రద్దు చేస్తాం – ఎం ఈ.ఓ సి.హెచ్.శ్రీనివాస్

PALASA : ఓ కార్పొరేట్ విద్యాసంస్థ లో పుస్తకాలు అమ్ముతున్నారన్న ఫిర్యాదు వచ్చిన కారణంగా సదరు విద్యాసంస్థలో ఆకస్మిక తనికీలు చేసి షోకాజ్ నోటీసులందించామన్నారు.

పుస్తకాలు అమ్మితే తాటతీస్తాం.

ప్రస్తుత కాలంలో ప్రయివేటు పాఠశాలల హవా గట్టిగానే వీస్తోంది.  సందు సందునా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుండి  అధికమొత్తాల్లో ఫీజులు వసూలు చేస్తుండడమే కాకుండా విద్యాలయాలను వ్యాపారకేంద్రాలుగా మార్చి పుస్తకాల రూపంలో అధిక ధరలకు అమ్మకాలు జరుపుతూ ముక్కు పిండి వసూలు చేస్తూ ధనార్జన చేసుకుంటున్నారని,  పుస్తకాలు తప్పనిసరిగా తమవద్దే కొనాలన్న ఆంక్షలు విధిస్తున్నాయన్న విమర్శలు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న నేపథ్యంలో… శ్రీకాకుళం జిల్లా పలాస మండల విద్యాశాఖాధికారి ని వివరణ కోరగా ఎం ఈ.ఓ సి.హెచ్.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ…

ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం కుగాను విద్యార్థుల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో నిబంధనలను ఉల్లంఘించి తమ విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాలు లాంటివాటిని అమ్ముతున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. రీసెంట్ గా ఓ కార్పొరేట్ విద్యాసంస్థ లో పుస్తకాలు అమ్ముతున్నారన్న ఫిర్యాదు వచ్చిన కారణంగా సదరు విద్యాసంస్థలో ఆకస్మిక తనికీలు చేసి షోకాజ్ నోటీసులందించామన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సూచనల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ప్రయివేటు విద్యాసంస్థలు పుస్తకాలు, యూనిఫారాలతోపాటు ఏవైనా విక్రయాలు జరిపితే అటువంటి విద్యాసంస్థల గుర్తింపును తక్షణమే రద్దు చేసేందుకు వెనుకాడబోమని ఈసందర్భంగా ఏం.ఈ.ఓ శ్రీనివాస్ హెచ్చరించారు.

 

RELATED ARTICLES

Most Popular