Homeఆంధ్రప్రదేశ్గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పలాస ఎమ్మెల్యే - గౌతు శిరీష.

గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన పలాస ఎమ్మెల్యే – గౌతు శిరీష.

PALASA : ​పలాస నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగంగా పూర్తి చేస్తోందని ఆమె పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వంలో పలాస నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు కళ్లముందే కనిపిస్తున్నాయని గత రెండేళ్ల పాలనలో పలాస మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా పలాస లో ఎమ్మెల్యే గౌతు శిరీష మీడియా సమావేశంలో మాట్లాడుతూ….

​పలాస నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వేగంగా పూర్తి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. పలాస మున్సిపాలిటీకి కానుకగా ఇవ్వబోతున్న ఆర్‌ఓబీ పనులు మరికొద్ది నెలల్లోనే పూర్తి కానున్నాయని తెలిపారు.  కేంద్రీయ విద్యాలయం రానే రాదని గతంలో కొందరు విమర్శలు చేస్తూ సూదికొండ వద్ద డ్రామాలు ఆడారని,  కానీ నేడు తాత్కాలిక పాఠశాలలో తరగతులు ప్రారంభం కావడమే కాకుండా,  శాశ్వత భవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించిందని తెలిపారు.  కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ‘సాగరమాల’  ప్రాజెక్టు ద్వారా మత్స్యకార గ్రామాల్లో సౌర శక్తితో విద్యుత్ కాంతులు విరజిల్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.  గతంలో ఆయనను ‘బెంచీల మంత్రి’ అని ఎగతాళి చేసిన వారికి ఇదే సమాధానమని ఎద్దేవాచేశారు.

గత ​వైసిపి పాలనలో మత్స్యకారులను తీవ్రంగా వంచించారన్న ఆమె ఉప్పలవేరు,  మంచినీళ్లపేట వంటి ప్రాంతాలలో సుమారు 321 మంది మత్స్యకారులకు అందాల్సిన ‘మత్స్యకార భరోసా’ ను  గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తుచేశారు.   నేడు కూటమి ప్రభుత్వం పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా,  నిష్పక్షపాతంగా రెట్టింపు మత్స్యకార భరోసాతో ప్రతి ఒక్కరినీ ఆదుకుంటోందని స్పష్టం చేశారు.

​విద్యుత్, ఇంధన ధరల భారంపై మాట్లాడుతూ:
​”గత వైసిపి ప్రభుత్వ హయాంలో పెట్రోల్,  డీజిల్ ధరలను లీటరుకు రూ. 41 వరకు పెంచడమే కాకుండా,  ఏకంగా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారన్నారు.  నేడు ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ‘ట్రూ డౌన్ ఛార్జీలు’ (True Down Charges) అమలు చేస్తూ,  ఈ ఐదేళ్లలో రూపాయి కూడా కరెంట్ బిల్లు పెంచబోమని బల్లగుద్ది చెపుతున్నానన్నారు.

​గత వైసిపి హయాంలో దళితులపై జరిగిన దాడులు,  అన్యాయాలను ప్రజలు ఎన్నటికీ మరువరన్న ఎమ్మెల్యే శిరీష,  దళిత డాక్టర్ సుధాకర్ ఆత్మహత్య ఉదంతం, వైసిపి ఎమ్మెల్సీ చేత దారుణ హత్యకు గురై డోర్ డెలివరీ చేయబడిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసులను ఈ సందర్భంగా ప్రస్తావించారు.   ప్రశ్నించిన యాదగిరి అనే దళితుడిపైనే దళిత అట్రాసిటీ కేసు పెట్టించిన ఘనత వైసిపి నాయకులదని మండిపడ్డారు.  తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లు ఉన్న వీధుల్లో రోడ్లు కూడా వేయకుండా వివక్ష చూపించిన నీచ చరిత్ర గత ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు.

​నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే మరోసారి బుద్ధి చెప్తారని,  చంద్రబాబు నాయుడుపై గానీ,   కూటమి ప్రభుత్వంపై గానీ ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల దృష్టిలో వైసిపి నేతలే నవ్వులపాలు అవుతారని హెచ్చరించారు.   గత ఐదేళ్ల వైసిపి పాలన అరాచకాలతో నిండిపోతే,  నేడు కూటమి ప్రభుత్వంలో ప్రతి చేతికీ పని, ప్రతి చేనుకీ నీరు అందిస్తూ పలాస ను ‘సేఫ్ పలాస’ (Safe Palasa) గా మార్చేందుకు ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. వైసిపి నేతలకు దమ్ముంటే వారి హయాంలో మత్స్యకారులకు చేసిన మేలు ఏంటో, పలాసలో చేసిన అభివృద్ధి ఏంటో సాక్ష్యాలతో సహా నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular