ప్లాస్టిక్ అమ్మకాలను అరికట్టలేరా?
ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేదిస్తూ ప్లాస్టిక్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ అవుతుండగా…
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ లో మాత్రం విచ్చలవిడిగా ప్లాస్టిక్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. దీంతో మునిసిపాలిటీ లో ఎటుచూసినా ప్లాస్టిక్ వ్యర్ధపదార్ధాలతో చెత్తకుప్పలు దుర్గంధం వెదజల్లుతూ దర్శనమిస్తున్నాయి.
మార్కెట్ లో ప్రతి దుకాణంలోనూ వినియోగదారులకు ప్లాసిక్ కవర్లలోనే నిత్యావసర సరుకులు, కూరగాయలు అందిస్తుండడంతో జంటపట్టణాల్లో ప్లాస్టిక్ భూతం విచ్చలవిడిగా దర్శనమిస్తోంది.
మునిసిపాలిటీ అధికారులు పలుమార్లు తనికీలు చేసిన క్రమంలో చిన్న చిన్న ఫైన్ లు వేసి విడిచిపెడుతుండడంతో, అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండాపోయిందని, అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా మునిసిపాలిటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ప్లాస్టిక్ అమ్మకాలు జరుపుతున్న వారి దుకాణాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకొని పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పలువురు మేధావులు కోరుతున్నారు.
