Homeఆంధ్రప్రదేశ్తాళాలు వేసిఉన్న ఇంటిలో దొంగలు.

తాళాలు వేసిఉన్న ఇంటిలో దొంగలు.

PALASA: తాళాలు వేసిఉన్న ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడి వెండి ఆభరణాలతోపాటు నగదును దోచుకెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస లో చోటుచేసుకుంది

Palasa: తాళాలు వేసిఉన్న ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడి వెండి ఆభరణాలతోపాటు నగదును దోచుకెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస లో చోటుచేసుకుంది.

పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ రోటరీనగర్ లోగల ఆర్.డబ్ల్యు.యెస్ డిపార్ట్మెంట్ లో డి.ఈ గా విధులునిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో శనివారం రాత్రి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.వేసవి సెలవులు కావడంతో కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి సొంత ఊరికి వెళ్లిన నేపధ్యంలో తాళం వేసిఉన్న ఇంటిని దొంగలు టార్గెట్ చేసినట్లు తెలుస్తుండగా,బంగారు ఆభరణాలను తనతోపాటు తీసుకెళ్లినట్లు చెపుతున్న బాధితురాలు బీరువా తాళాలు పగలగొట్టి సుమారు 25 తులాల వెండి ఆభరణాలతోపాటు,సుమారు 50 వేల రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె చెపుతున్నారు.

కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు వేలిముద్రల సేకరణతోపాటు సి.సి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular