శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బల్లెడ రవికృష్ణ… భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. దేశ భద్రత కోసం రెండు దశాబ్దాలకు పైగా సేవలందించిన రవికృష్ణకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
గ్రామంలోకి అడుగుపెట్టగానే పూలమాలలతో, హర్షధ్వానాలతో ఆయనను ఆహ్వానించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలు అందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రవికృష్ణపై గ్రామస్తులు గర్వం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ…26 సంవత్సరాలు దేశానికి సేవ చేయడం తనకు గర్వకారణమని, తనకు సహకరించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత కూడా దేశ సేవ వైపు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
