ఒక తండ్రి కల… ఒక తల్లి త్యాగం… ఒక కుమారుడి పట్టుదల… నేడు వైద్యుడి రూపంలో సాకారమైంది.
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పద్మనాభపురం గ్రామానికి చెందిన శ్రీ కొండె నరసింహ కుమారుడు డా. కొండె రాజ్‌కుమార్ ఫిలిప్పీన్స్ దేశంలో 5½ సంవత్సరాల ఎం.బి.బి.ఎస్. (జనరల్ మెడిసిన్) విద్యను విజయవంతంగా పూర్తి చేసి, భారతదేశంలో నిర్వహించిన అర్హత పరీక్షలో కూడా ఉత్తీర్ణులవడం మన పలాస ప్రాంతానికే గర్వకారణం అని రాష్ట్ర బి సి సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వర రావు యాదవ్ అన్నారు.
ఈ శుభ సందర్భంగా వారి నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి, దుశ్శాలువతో సత్కరించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని సాధారణ కుటుంబంలో జన్మించిన ఒక యువకుడు తన లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా కష్టపడి చదివి, విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్‌గా నిలవడం నిజంగా అభినందనీయం.
ఇలాంటి విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ఎన్నో కష్టాలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం దాగి ఉంటాయి.
“కొడుకు పుట్టినప్పుడు మాత్రమే కాదు… తన ప్రతిభతో తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకొచ్చినప్పుడే నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది” అని మన పెద్దలు చెప్పిన మాటను డా. రాజ్‌కుమార్ ఈరోజు నిజం చేశారు. వారి విజయం వారి కుటుంబానికే కాదు, పద్మనాభపురం గ్రామానికి, పలాస ప్రాంతానికి కూడా గర్వకారణంగా నిలిచింది.
ఇకపై వైద్యుడిగా మీ జ్ఞానం, మీ సేవలు పేద ప్రజలకు అండగా నిలవాలని, మీ చేతుల ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడబడాలని, సమాజానికి ఆదర్శ వైద్యుడిగా ఎదిగి దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.
