NARASANNAPETA : స్వర్ణాంధ్ర స్వచ్చంధ్ర లో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకుగాను జిల్లా ఎస్పీ కే వి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎండలు తీవ్రత అధికంగా ఉండడంతో మండుటెండలో పోలీసులు విధులు నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ ఛైర్మెన్ ఈదురు పద్మాకర్ సూచన మేరకు ఏపీ మరియు ఒడిశా రాష్ట్రాల ఇన్ ఛార్జ్ చైర్మన్ డాక్టర్ చిన్నవాడు ఆధ్వర్యంలో పోలీసులకు తమవంతు బాధ్యతగా మంచినీరు బాటిళ్లను అందజేసి తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.
ఈకార్యక్రమానికి నరసన్నపేట పోలీస్ స్టేషన్ ఎస్సై బి.గణేష్ తోడ్పాటునివ్వగా,HRECI శ్రీకాకుళం జిల్లా కన్వీనర్లు మొయ్యి జగన్నాధం,పంగ శివయ్య,తలసముద్రం రాజారావు మంచినీళ్ల బాటిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పోలీసుల ప్రశంసలు అందుకున్నారు.
