జిల్లాలో ఏఎస్ఈ మండల కార్యవర్గాల ఎన్నిక జోరు
కంచిలి, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో నూతన కార్యవర్గాలు ఏకగ్రీవం.
అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ (ఏఎస్ఈ) శ్రీకాకుళం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో మండల స్థాయి కార్యవర్గాల ఎన్నిక ప్రక్రియ జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సబ్ డివిజన్ పరిధిలోని కవిటి, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో ఉండే ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మండల స్థాయి కార్యవర్గాలను ఏఎస్ఈ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉప్పాడ జయకృష్ణ, డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ హరిచంద్ర ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయాల్లో సమావేశం ఏర్పాటు చేసుకుని తీర్మానించారు. ఇందులో భాగంగా నాలుగు మండలాల్లో నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కంచిలి మండలం: పీఆర్ ఆఫీస్ భవనంలో జరిగిన సమావేశంలో Ms పల్లి సచివాలయానికి చెందిన యు. జయకృష్ణ అధ్యక్షుడిగా, భోగబేని సచివాలయానికి చెందిన ఎన్. కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, అంపురం సచివాలయానికి చెందిన ఆర్. రోజా మహిళా కార్యదర్శిగా, తలతంపర-2 సచివాలయానికి చెందిన ఎం. కిరణ్ కుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
సోంపేట మండలం: ఎంఆర్సీ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో పాలసపురం సచివాలయానికి చెందిన ఎం. రామకృష్ణ అధ్యక్షుడిగా, గొల్లవూరు సచివాలయానికి చెందిన అల్లు లోకేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, మాకన్నపురం సచివాలయానికి చెందిన సల్లా పవన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
కవిటి మండలం: ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాజపురం-2 సచివాలయానికి చెందిన డి. హరిచంద్ర అధ్యక్షుడిగా, మాణిక్యాపురం సచివాలయానికి చెందిన పి. చాణక్య ప్రధాన కార్యదర్శిగా, డి.జి. పుట్టుగ సచివాలయానికి చెందిన ఎండీ. జావేద్ ఖాన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
ఇచ్ఛాపురం మండలం: ఎంఆర్ఓ కార్యాలయ భవనంలో సోమవారం జరిగిన సమావేశంలో తెలుకుంచి సచివాలయానికి చెందిన డి.ఎస్. వర్మ అధ్యక్షుడిగా, బాలకృష్ణాపురం సచివాలయానికి చెందిన బి. మనోజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా, తులసిగాం సచివాలయానికి చెందిన ఎ. సురేష్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.
ఇంజనీరింగ్ సహాయకుల ఉద్యోగ భద్రత, సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యవర్గాలు కృషి చేస్తాయని నూతన అధ్యక్షులు తెలిపారు. జిల్లాలోని మిగిలిన 26 మండలాల్లోనూ త్వరలో కార్యవర్గాల ఎన్నిక పూర్తి కానుందని పేర్కొన్నారు.
