Homeఆంధ్రప్రదేశ్మునిసిపల్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడికి విద్యుత్ షాక్ కి గురి.

మునిసిపల్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడికి విద్యుత్ షాక్ కి గురి.

PALASA : మునిసిపల్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడికి విద్యుత్ షాక్ కి గురి.

PALASA : శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మేఘాలు అలముకుని ఉరుములు,మెరుపులు గర్జనలు ఏర్పడ్డాయి.

అదే సమయంలో మునిసిపాలిటీ లో వీధి దీపాలకు సంబంధించిన లైన్ ను విద్యుత్ స్తంభం పై నెయ్యిల గణపతి అనే మునిసిపల్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు సరిచేస్తుండగా గర్జనలకు విద్యుత్ వైర్లలో విద్యుత్ ప్రవహించి షాక్ కు గురై పోల్ పైనుండి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు.

తోటి సిబ్బంది హుటాహుటిన పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా,మెరుగైన వైద్యం కోసం వైద్యులు టెక్కలి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం క్షతగాత్రుడైన నెయ్యిల గణపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పలాస కాశీబుగ్గ మునిసిపల్ కమీషనర్ ఈ. శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular