చందూ కుటుంబానికి రూ.2,12,500/-లు ఆర్థిక సహాయం
శ్రీకాకుళం : అంపోలు చందూ కుటుంబానికి రూ.2,12,500/-లు ఆర్థిక సాయాన్ని జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శుక్రవారం అందించారు. యూనియన్ పిలుపు మేరకు ఇటివల అనారోగ్యంతో పలాస AESTFలో పనిచేస్తూ మృతి చెందిన ఆంపోలు చందు కుటుంబానికి జిల్లా కానిస్టేబుల్ లు, హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ సభ్యులు చందూ కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించారు. ఆర్ధిక సహాయం అందించిన యూనియన్ సభ్యులకు చందూ కుటుంబ సభ్యులు హృదయ పూర్వక ధన్యవాదములు తెలిపారు.
