Homeఆంధ్రప్రదేశ్నువ్వలరేవులో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.

నువ్వలరేవులో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.

PALASA : నువ్వలరేవులో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.

నువ్వలరేవులో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష.

PALASA : పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష గారు, జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుండి వచ్చిన రెవెన్యూ సంబంధిత సమస్యలు, భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, భూముల రికార్డులు తదితర అంశాలపై అధికారులు వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే గారు సూచించారు.  ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించడమే ఇటువంటి రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి” అని ఎమ్మెల్యే గౌతు శిరీష గారు అన్నారు

RELATED ARTICLES

Most Popular