PALASA : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం లోగల శ్రీ సత్యసాయి విద్యావిహర్ నిర్వాహకులు,ఉపాధ్యాయులు 2026- 2027 నూతన విద్యాసంవత్సరం ప్రారంభం సందర్భంగా శుక్రవారం నాడు వినూత్నంగా సనాతన సంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ మంగళ వాయిద్యాల నడుమ మంగళ శాసనాలతో విద్యార్థిని విద్యార్థులకు సంస్థ నిర్వాహకులు ప్రేమతో స్వాగతం పలికారు.


కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ నిర్వాహకులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని తిలకించిన విద్యార్థుల తల్లిదండ్రులు సంభ్రమాశ్చర్యాలతో పులకితులయ్యారు.
విద్యార్థులకు విద్య విజ్ఞానం అందించడం తోపాటు సంస్కృతి,సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ విద్యార్థుల్లో దైవభక్తి తోపాటు దేశభక్తిని పెంపొందించడమే ట్రస్ట్ ముఖ్యఉద్దేశమని ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు చెపుతున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు ఉప అధ్యక్షులు తాలాసు శ్రీను, ప్రిన్సిపాల్ ప్రీతిచౌదరి, గవర్నింగ్ బాడీ మెంబర్ మల్లా శరత్ బాబు పలాస కాశిబుగ్గ కన్వీనర్లు తిరుమల, నాగరాజు, నారాయణరావు, ఉపాధ్యాయులు అనుదీప్, మురళి, సూర్యతేజ, కల్పన పాల్గొన్నారు
