HomeUncategorizedకవిటిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కు ఘన సత్కారం.

కవిటిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కు ఘన సత్కారం.

సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం – కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
నేరేడు బ్యారేజి పనులు త్వరలో ప్రారంభం – ఉద్దాన రైతులకు హామీ.

కవిటిలో రామ్మోహన్ కు ఘన సత్కారం.

శ్రీకాకుళం జిల్లా రైతులకు హామీ ఇచ్చిన విధంగానే నేరేడు బ్యారేజీకి అనుమతులు సాధించామని,  పనులను త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

ఉద్దాన రైతుల సత్కారం :
శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పర్యటించిన రామ్మోహన్ నాయుడు,  ప్రభుత్వ విప్ –  ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను ఉద్దాన ప్రాంత రైతులు కలిసి ఘనంగా సత్కరించారు.   కవిటి మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేంద్రమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రైతులు దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నేరేడు బ్యారేజి పోరాటం :
ఈ సందర్భంగా వేదికపై నుంచి రైతులను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ఇచ్ఛాపురం తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనదని అన్నారు.   నేరేడు బ్యారేజికి అనుమతులు వచ్చే వరకు రైతులు పోరాటం చేయగా,  అందుకు సమాంతరంగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.  కేంద్ర మంత్రులు,  ట్రిబ్యునల్,  ఒడిశా ముఖ్యమంత్రుల వద్ద సమస్యను ప్రస్తావించి పరిష్కరించామని చెప్పారు.

పూర్తిస్థాయిలో సాగునీరు :

పూర్తిస్థాయిలో సాగునీటి సమస్యలు లేకుండా చేసే విధంగా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు.  ఇందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోడ్పాటుతో వేగంగానే లక్ష్యాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ సంఘం ప్రతినిధులు,  ఉద్దాన ప్రాంత రైతులు,  స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular