కర్తలిలో ఫౌజ్ పెన్షన్ పంపిణీ టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు చేతుల మీదుగా పెన్షన్ అందజేత
కంచిలి మండలం కర్తలి గ్రామంలో టీడీపీ నాయకులు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. గ్రామానికి చెందిన పౌజ్ పెన్షన్ లబ్ధిదారు పైల రామయ్య భార్యకు టీడీపీ మండల అధ్యక్షుడు మాదిన రామారావు చేతుల మీదుగా పెన్షన్ అందజేశారు.
జూన్ నెల నుంచి వితంతు పెన్షన్, వికలాంగ పెన్షన్, తదుపరి వృద్ధాప్య పెన్షన్లు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఐటీడీపీ మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి, మాజీ సర్పంచి సూర్యనారాయణ రెడ్డి, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.
